అమరావతి సీఆర్డీఏ పరిధిలో నివసించే పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్కడ భూమి లేని వారికి రూ.2,500 పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు దాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం నుంచి ఈ పెన్షన్ అమలులోకి వచ్చింది. 17,215 మందికి రూ.5000 పెన్షన్ అందించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అర్హులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు.