మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన జరిగింది. హైవే నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడి షేక్ రహ్మునిస్సా రియాజ్(3) చిన్నారి గురువారం మృతి చెందింది. మీరా భయందర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం చిన్నారిని తీసుకోని కార్యక్రమానికి వెళ్లారు.
అక్కడ చుట్టుప్రక్కల పరిసరాల్లో ఆడుకుంటూ చిన్నారి నీటి గుంటలోపడిందని సమాచారం. దీంతో చిన్నారి కుటుంబంలో కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.