ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని.. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వైయస్ఆర్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం విశాఖ నగరంలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో మంత్రులు, పార్టీ నేతలతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపులకు రూ. 25 కోట్లు భూమి కేటాయించడం సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అదీ విశాఖ నడిబొడ్డున.. హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.