అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైయస్ జగన్ మేలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేశారు. కాపు నేస్తం పథకం ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారు. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం వైయస్ జగన్ కల్పించారు. కాపులకు సేవ చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం అని బొత్స ఝాన్సీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీదర్, కొండా రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.