ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య కార్యక్రమాలలో రాష్ట్రమే ముందంజలో ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 04:25 PM

ప్ర‌జ‌లంద‌రికీ సంపూర్ణ ఆరోగ్య‌మే ల‌క్ష్యంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నార‌ని గాజువాకా ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి తెలిపారు. జ‌గనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయ‌ని చెప్పారు. గురువారం కణితి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వడ్లపూడి -1  సచివాలయం పరిధిలోని 250 మందికి, స్పెషలిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్బంగా తిప్పల నాగిరెడ్డి  మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 87వ‌ వార్డు ఇంచార్జ్  కోమటి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రతి గడపకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం ద్వారా, ఆరోగ్యాన్ని ప్రజలందరీ హక్కుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే దక్కుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com