2024లో టీడీపీ, జనసేన జెండాలను మడతేయడం ఖాయమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. టీడీపీ, జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నామస్మరణే చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టదు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. పవన్ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు.. అది కొందరి రాజధానే అని పవన్ గతంలో ఎందుకన్నారు. ఆరోజుకు.. ఈరోజుకు.. అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్ చెప్పాలని డిమాండు చేశారు.