చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్కళ్యాణ్ అంటూ వైయస్ఆర్సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. జెండా కూలీలుగా ఇన్నాళ్లూ నిన్ను అభిమానించే నాయకుల్ని ఏమార్చావు. కార్యకర్తల్ని కూడా ఏమార్చావు. నిన్న చంద్రబాబు పార్టీ జెండా పట్టుకుని నువ్వు కూడా పెద్ద జెండా కూలీగా మారావు. దీన్నిబట్టి నువ్వు, చంద్రబాబు ఎంత అవమానకర పరిస్థితిలో ఉన్నారో తెలుసా..? మీ పార్టీల జెండాల్ని పక్కనబెట్టి పక్క పార్టీల జెండాల్ని పట్టి ఊపడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయాల్లో మీ ఇద్దరికీ మాత్రమే సాధ్యం. వేరే ఇతర ఏ రాజకీయ పార్టీకీ అలాంటి దుస్థితి రానుగాక రానేరాదు అంటూ నందిగం సురేష్ మండిపడ్డారు.