రాజకీయాల్లో చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు సరైన మొగుడు...సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్. సీఎం వైయస్ జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. లేకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నాడు. అవును.. ఆయన పేరు పవన్ కల్యాణ్ కాదు. వైయస్ జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్‌ను పుట్టించిన వాళ్లు రావాలి. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైయస్ జగన్. అలాంటిది సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. జనసైనికులను అడిగితే పవన్ గొప్పో.. జగన్ గొప్పో చెబుతారు అన్నారు.