రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. క్యాంప్ కార్యాలయం వైపు దూసుకు వెళ్తున్న యువజన విద్యార్థి జేఎసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు.