ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని జేడీ లష్మినారాయణ అన్నారు. విభజన జరిగి పదేళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేలా కృషి చేయాలి లేదంటే ప్రజలు క్షమించరన్నారు. అందరూ కలసి రాష్ట్రాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం అంటోన్న సీఎం జగన్.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్దమవ్వాలన్నారు. హోదా సాధన కోసం టీడీపీ కమ్యూనిస్టులు ఇతర పార్టీలంతా కలసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.