డోన్ పట్టణంలో శుక్రవారం నిర్వహిస్తున్న టీడీపీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు. డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాత.. మొదటి సారిగా డోన్‌కు వస్తుండటంతో ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాల నాయకులు ఈ సభకు తరలిరానున్నారు. దీంతో డోన్‌లో ఎక్కడా చూసినా తెలుగు త మ్ముళ్ల సందడి కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలో డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్, ఓబులాపురం శేషిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్న గౌడు, మర్రి రమణ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, డోన్, ప్యాపిలి, బేతం చెర్ల మండలాల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, గండికోట రామ సుబ్బయ్య, ఎల్లనాగయ్య, ఓంప్రకాష్, ఎరుకల చెరువు శివ, మాజీ ఎంపీ టీసీ బుగ్గన ప్రసన్నలక్ష్మి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పోలూరు వెంక టేశ్వరరెడ్డి ఏర్పాట్లు చూస్తున్నారు. గుత్తి రోడ్డులోని అమ్మ హోటల్ సర్కిల్ నుంచి పాతబస్టాండు మీదుగా మధు ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.