మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం నాడు ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్ల తన బిడ్డకు ప్రాణహాని ఉందనే భయం కలుగుతుందంటూ ప్రత్తిపాటి కంట నీరు పెట్టారు. అయితే శరత్ అక్రమ అరెస్ట్‌ను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. గురువారం నాడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అని చెప్పారు. ఎన్నికల వేళ సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగమే పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని ఆవేదన వ్యకత్ం చేశారు.