గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కలరా మహమ్మారి గురించి మర్చిపోయిన తరుణంలో ఈ కేసులు బయటపడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 345 మల నమూనాలను పరీక్షిస్తే.. మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధులన్నీ వ్యాపిస్తున్నాయి.