జగనన్న విద్యాదీవెన పథకం కింద 9. 44 లక్షల మంది విద్యార్థులకు రూ. 708. 68 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. అందులో భాగంగానే శుక్రవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని అనంతరం విద్యాదీవెనకు సంబంధించిన చెక్కును ఆవిష్కరించడం జరిగింది.