ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తోంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.