బీజేపీ పాలిత గుజరాత్‌లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
'మూడేళ్లలో 25,478 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పరిస్థితి దారుణాన్ని తెలియజేస్తోంది. వీరిలో 500 మంది విద్యార్థులే కావడం గమనార్హం. సొంత రాష్ట్రంలో మానవ విషాదంపై ప్రధాని మౌనం వహించడం సరికాదు' అని ఆయన మండిపడ్డారు.