వైసీపీ మంత్రి బొత్స నారాయణపై పోటీకి టీడీపీ నేతలు వెనకాడుతున్నారు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ అనగానే తమ్ముళ్లు జారుకుంటున్నారు.
మా దారి మేము చూసుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నేతలు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రిజెక్ట్ చేశారు.