సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. శనివారం చెన్నేకొత్తపల్లి, కుంటిమద్ది, రామగిరి, నాగసముద్రం, పోలేపల్లి, నసనకోట, భానుకోట, కనగానపల్లి పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు.