రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. కనగానపల్లి మండలం దాదాలూరు కొట్టాల గ్రామానికి చెంది చంద్రశేఖర్ రెడ్డి(38) తన పొలానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోని హైవే రోడ్డు దాటుతుండగా అనంతపురం నుంచి బెంగళూరు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.