ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల బూత్ కమిటీ సభ్యులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు నేరుగా అందించామని కావున ప్రతి బూతులోను వైయస్సార్సీపీకి భారీగా మెజార్టీ రావాలని అందుకు బూత్ కమిటీ సభ్యులందరూ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.