ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం రాత్రి సిల్క్ హౌస్ యజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ పట్టుచీరల వ్యాపారస్తుడు అరుణా సిల్క్స్ రాజు ఇంటిలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖ చేనేత వ్యాపారులందరూ పాల్గొన్నారు. వైసిపిని గెలిపిస్తే చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.