చిలమత్తూరు మండలంలోని డి. గొల్లపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి (68) మృతదేహం శనివారం అడవిలో లభ్యమైనది. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు రామిరెడ్డి గత 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడని రాత్రి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇండ్లలో విచారించిన ఆయన ఆచూకి తెలియలేదన్నారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలో దుర్వాసన రావడంతో పశువుల కాపరులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.