ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు విమర్శించారు. ‘ఎవరైనా ఆయన్ను వ్యతిరేకించినా.. చేసింది తప్పని చెప్పినా.. ఇక వారి పని అయిపోయినట్లే.
అలా ప్రశ్నించినందుకే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదు. సీఎం జగన్ అవలంబిస్తోన్న తీరును చూస్తే చాలా బాధేస్తోంది’ అని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు.