భారతదేశంలో తీవ్ర పేదరికం దాదాపుగా పోయినట్లేనని వరల్డ్ పావర్టీ క్లాక్ వెల్లడించింది. కొనుగోలు శక్తి రోజుకు $1.9 (రూ.158) కంటే దిగువనున్న వారి సంఖ్య 3% కన్నా తక్కువని పేర్కొంది. '3.4 కోట్ల మంది తీవ్ర దారిద్య్రంలో ఉన్నారు.
ఈ సంఖ్య 2023లో 4కోట్లు, 2022లో 4.6 కోట్లుగా ఉంది. వీరిలో 94% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే' అని చెబుతోంది. కాగా దేశంలో పేదలు 5శాతం లోపేనని నీతి ఆయోగ్ ఇటీవల తెలిపింది.