ఫిబ్రవరి 26న ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలుడిని 54 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేశాడు. పిల్లాడు కనపడకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అడవిలో బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గయాసుద్దీన్ అనే వ్యక్తి ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలుడిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి పోలీసులు అతడిని విచారిస్తున్నారు.