అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైనిక విమానాల ద్వారా గాజావాసులకు ఫుడ్ ప్యాకెట్ల రూపంలో ఆహారాన్ని జారవిడుస్తామని వెల్లడించారు. ఇప్పటికే జోర్డాన్, ఫ్రాన్స్ దేశాలు ఈ తరహాలో గాజాకు ఫుడ్ అందిస్తున్నాయి.
ఆహారం దొరక్క జంతువుల ఆహారాన్ని, గడ్డి మొక్కల్ని కూడా గాజా ప్రజలు తింటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలు పోషకాహార లోపంతో చనిపోతున్నారని యూఎన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.