సీఎం జగన్ను సాగనంపాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ.. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దె దించి ఏపీని రక్షించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు.
దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అంతా కలిసి అడ్డుకోవాలన్నారు. అధికార దుర్వినియోగాన్ని పాల్పడే అధికారులను బయటకు పంపాలన్నారు. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.