గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ-పలాస రైలు లోకో పైలట్, సహాయ లోకో పైలట్ కలిసి ఫోన్లో క్రికెట్ చూశారు.
క్రికెట్ చూస్తూ రైలు నడపడమే ప్రమాదానికి కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దాంతో విధుల్లోని పైలట్ల తీరును నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. కాగా గతేడాది జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించారు.