రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభలు, సమావేశాలు నిర్వహించాలని AP కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన సమావేశంలో కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్ర విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించేందుకు ఈ నెల 7వ తేదీన గుంటూరులో బహిరంగసభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.