వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా తరలివస్తున్న భక్తులకు… ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం (SSD), రూ.300ప్రత్యేకప్రవేశ దర్శనం (SED) టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని TTD ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి SSD, SED టికెట్ల కోటా పెంచుతామన్నారు.