రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి సీఎం జగన్ అప్పు తెచ్చారని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన వార్తపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్(X) వేదికగా స్పందించారు.
‘‘రూ.370 కోట్లకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడమేంటి?. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’’ అని ట్వీట్ చేశారు.