బాపట్ల ఎంపీ స్థానానికి టీడీపీ తరపున ఎంఎస్ రాజును చంద్రబాబు ఖరారు చేశారని సమాచారం. ఆయన టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. సుదీర్ఘంగా వైసీపీ పై పోరాటం చేయడంలో ఆయన ముందు ఉన్నారు.
టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి పేరును కూడా పరిశీలించారు. అయితే సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో పాటు.. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంఎస్ రాజును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.