గుంతకల్లు పట్టణంలోని 32 వార్డులోని షికారీ కాలనీలో మురుగు కాలువల మధ్య తాగునీరు కుళాయి ఉండడంతో ఆకాలనీ మహిళలు నీరు కోసం దుర్గంధం మధ్య వ్యధలు పడుతున్నారు. తమ ఓట్ల కోసం వెంపర్లాడే పాలకులు తమకు సౌకర్యాలు కల్పించడం లేదని వాపోతున్నారు. తాగునీరు కోసం కుళాయి వద్ద ముక్కు మూసుకుని ఉండాల్సి వస్తోందని ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులపై ఆ కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారం చేయాలని వారు కోరుచున్నారు.