శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినులను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. విద్యార్థినులతో చాటింగ్ చేస్తూ వారు స్నానం చేస్తున్న వీడియోలు పంపమని అడిగేవాడు. ఆ వీడియోలతో బెదిరింపులకు పాల్పడి లైంగికంగా వేధించేవాడు. వేధింపులు పెరగడంతో విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.