పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి యువత పెద్ద ఎత్తున జనసేనలో చేరారని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, శ్రీరామ రామాంజనేయులు అన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో యువతకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం మదనపల్లె నియోజకవర్గం జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు.