అనారోగ్యం తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మదనపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు. ఇందిరానగర్ లో ఉంటున్న ఆయేషా (65) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో కత్తితో గొంతు కోసుకుంది. పక్క ఇంటి వాళ్లు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఆమెను పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa