‘గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ టికెట్‌ను నా కుమార్తెకు ఇస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? నేనే సంతోషంగా నా కుమార్తెకు టికెట్ ఇవ్వాలని సీఎం వైయస్ జగన్‌ను అడిగాను అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. అయన మాట్లాడుతూ.... నా సేవలను పార్టీ మరో రకంగా వినియోగించుకుంటుంది. నేను ఎప్పుడూ వైఎస్ కుటుంబాన్ని వదలను. దళితుడినైన నన్ను గుర్తించి డిప్యూటీ సీఎం పదవి వరకు తీసుకెళ్లిన సీఎం వైయస్ జగన్ మేలును ఎప్పటికీ మరువను. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను అమ్ముకునే సంస్కృతి చంద్రబాబుది’ అని విమర్శించారు.