పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ సీనియర్ ఎమ్మెల్యే తపస్ రాయ్ సోమవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీలో టీఎంసీ డిప్యూటీ చీఫ్ విప్ హోదాలో ఉన్నారు. పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరు, సందేశ్‌ఖాలీ అంశంపై నిర్లక్ష్యం వంటి కారణాలతో పార్టీని వీడినట్లు ప్రకటించారు. జనవరిలో తన నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపినప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని ఆయన వ్యాఖ్యానించారు.