అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహుజన సమాజ్ పార్టీ భారీ ఫ్లెక్సీని దుండగులు తొలగించారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పోలీసులు వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం బీఎస్పీ రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిని పులపకూర లిలిని ఆశారాణి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బహుజన సమాజ్ పార్టీ కేడర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.