ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు, వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ.. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఎన్నికల కోడ్ వచ్చాక ఇంకా మార్పు వస్తుందని తెలిపారు. వైసీపీ రౌడీలని రోడ్లపై తరిమికొట్టే రోజులు వస్తున్నాయన్నారు. విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తి విజయసాయిని నెల్లూరుకి పంపిస్తున్నారన్నారు. దోచుకున్న డబ్బుతో సిద్దం అంటూ హోర్డింగులా? అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్ల రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదని.. దేనికి సిద్దం... ఓడిపోవడానికి సిద్దమా అని ప్రశ్నించారు.