కర్నూలు అభివృద్ధికి ఆరు ముఖ్యమైన అంశాలు ఎంపిక చేసుకున్నానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సూపర్ సిక్స్‌తో పాటు.. తన సొంత సిక్స్ పాయింట్స్ అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు అంతా తిరిగి.. సమస్యలు గుర్తించి.. ప్రజలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. కర్నూలులో చంద్రబాబు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఏడాది లోపు హైకోర్టు బెంచ్ తెస్తానని చెప్పారు. చంద్రబాబు కియా తెచ్చారని.. అనంతపురం రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఓర్వకల్లులో అలాంటి పెద్ద పరిశ్రమ ఒకటి వస్తే కర్నూలు కూడా మారిపోతుందని అన్నారు. నారా లోకేష్‌తో చర్చించి తన మ్యానిఫెస్టో వివరించినట్లు టీజీ భరత్ పేర్కొన్నారు.