జయహో భారతీయం, దక్షిణాఫ్రికా-తెలంగాణ అసోసియేషన్ లింక్డ్ ఫీల్డ్స్ సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న 7500 మందితో లలితా సహస్రనామ మహా బృందగానం నిర్వహించ నున్నట్లు ఐఆర్‌ఎస్ అధికారి వి.కోటేశ్వరమ్మ తెలిపారు. విజయవాడ నగరంలోని జయహోభారతీయం సంస్థ కార్యాలయంలో ఆదివారం మహా బృందగానం విజయాన్ని కాంక్షిస్తూ మహాచండీహోమం, గణపతిహోమం, నవగ్రహ హోమాలను నిర్వహించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. భారతీయం సంస్థ లలితా పారాయణంతో పాటు ఏప్రిల్ 28న తెలుగురత్నాలు అవార్డులు ఇవ్వనుంది. నాట్యారామం పేరుతో వెయ్యిమంది కూచిపూడి నృత్యకళాకారులతో బృంద ప్రదర్శనలు చేయనున్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు మండవ శశిధర్‌చౌదరి, అధ్యక్షుడు వల్లేశ్వర్, గోళ్ల నారాయణరావు, వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు, సుదర్శన్ పాల్గొన్నారు.