ఎన్నికల్లో అధికార పార్టీ అభివృద్ధిని చూపుతూ పోటీకి రావడం లేదని, దోచిన డబ్బుతో పోటీకి వస్తోందని, గత ఎన్నికల కన్నా భిన్నమైన ఎన్నికలను చూడబోతున్నామని ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం నూజివీడులో నిర్వ హించిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సంక్షేమం నేతిబీరలో నేతి చందంగా ఉందన్నారు. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెబుతున్న ్టప్రభుత్వం ఆ నిధితో రైతులకు ఏం మేలుచేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. నాసిర కపు లిక్కర్ విక్రయాల వల్ల వేలాదిమంది ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం తనకున్న ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో ఇక నుంచి గ్రూప్‌లకు తావులేదని అందరం ఒకే కుటుంబంలా సమష్టిగా శ్రమించి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు చెప్పిన విధంగా నడుస్తానన్నారు.