బీసీలు, ఎస్సీలను అణగదొక్కిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. సకల జనుల చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని కత్తవపాడు, ఇరగవరం, అర్జునుడుపాలెం గ్రామాల్లో ఆదివారం పాదయాత్ర చేశారు. గ్రామాల్లో దారిపొడవునా టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు ఆయనను పూలమాలలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఆదివారం కావడంతో చర్చిల వద్ద క్రైస్తవులను ఆయన పలకరించగా పాస్టర్లు ఆరిమిల్లి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ప్రార్థనలు చేశారు. కత్తవపాడులో డ్రైనేజీ సమస్య వేధిస్తోందని, గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాలు కట్టించాలని స్థానికులు కోరగా రాధాకృష్ణ సానుకూ లంగా స్పందించారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మేటి వెంకట సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు, మండల కార్యదర్శి బొంతు శ్రీను, డి.గణపతి రాజు, కారం బాబూరావు, వేండ్ర నాగరాజేశ్వరరావు, వేండ్ర జనార్ధన్, ఏలూరు వెంకటేశ్వరరావు, చవ్వాకుల సత్యనారాయణ, మల్లుల శ్రీనివాసరావు, తానేటి సుబ్రమణ్యం, వేండ్ర పోతురాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.