బెంగళూరు జైలులో రాడికలైజేషన్ కేసులో NIA ఏడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏడు రాష్ట్రాల్లోని మొత్తం 17 చోట్ల ఏక కాలంలో NIA సోదాలు చేపట్టింది.
గతేడాది జులైలో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఎల్ఇటి దోషి టి నాజర్ తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ కేసు NIAకు బదిలీ అయింది. తాజా సోదాలలో నగదు, పిస్టల్స్, వాకీటాకీ సెట్లు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.