డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే ప్రశాంత్ కిశోర్ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్‌ను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదన్నారు. ఐప్యాక్ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏపార్టీ అతన్ని చేరదీయక పోతే తీసేసిన తహసీల్దార్లాగా బిహార్‌లో సొంత పార్టీ పెట్టి ఫలితం లేక డిజాస్టర్ అయిపోయాడన్నారు. చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడన్నారు. ఐప్యాక్ టీమ్ ఇప్పటికీవైయస్ఆర్ సీపీ కి పని చేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్లాగా జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించిన పీకే చెపితే రెండు, మూడు శాతం ఓట్లు మారి తనకు పడతాయనేది చంద్రబాబు ఆశ అని అన్నారు.