పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని మార్గాని భరత్‌రామ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక మహిళా వలంటీర్‌ను ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్‌తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మగతనం కాదన్నారు. ఈ కార్యక్రమంలోవైయస్ఆర్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.