రాజకీయ చరిత్రలో పార్టీ కార్యకర్తలకు అత్యంత విలువ, ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ వైయస్ఆర్ సీపీ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కార్యకర్తలు తమకు ఎమ్మెల్యే అభ్యర్థి వద్దంటే మార్చే పరిస్థితులు మరే పార్టీలోనైనా ఉంటాయా? అని ప్రశ్నించారు. టీడీపీలో డబ్బుంటేనే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమానికి డబ్బులు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని విమర్శిస్తున్న చంద్రబాబు.. ఆయన ప్రకటించిన పథకాలకు డబ్బులు ఏవిధంగా ఇస్తారని దుయ్యబట్టారు.