అనకాపల్లి నియోజకవర్గంలోని పిసినికాడ గ్రామంలో ఈనెల 7న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే “చేయూత’ సభ భారీ ఎత్తున విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, శ్రేణులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సభను ఎన్నికల శంఖారావ సభగా పరిగణించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిలో చాలామందికి అవకాశాలు లభించాయని, మిగిలిన వారికి కూడా పార్టీలో తగిన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.