అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ భరత్‌కు జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బెల్టు చూపించారు. ఎంపీకీ బెల్టు దెబ్బల రుచి చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.